Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ మూడు పాత్రలు నాకు ఎంతో ఇష్టం: కొరటాల శివ

  • నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇష్టమే 
  • రైటర్ గా నాకు సంతృప్తిని ఇచ్చింది 'బృందావనం'
  • దిల్ రాజుతో మరో సినిమా చేస్తాను    
"రైటర్ గా .. డైరెక్టర్ గా మీకు బాగా సంతృప్తిని ఇచ్చిన సినిమాలు ఏవి?"అనే ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ లో కొరటాల శివకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. నేను చేసే సినిమాలు ఒకదానికి మించి మరొకటి ఉండేలా చూసుకుంటాను. నా సినిమాల్లోని ఎమోషన్ నాకు బాగా నచ్చుతుంది. 'మిర్చి'లో ప్రభాస్ పాత్రను నేను బాగా ఇష్టపడతాను. ఆ సినిమాలోని డైలాగ్స్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇక 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్ బాబు పాత్ర కూడా మనసుకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ కథలోని పాయింట్ జనానికి ఎక్కేసింది"

 ఇక 'జనతా గ్యారేజ్'లోని ఎన్టీఆర్ పాత్ర కూడా నాకు చాలా ఇష్టం. ఇట్లా నాకు ఈ మూడు సినిమాల్లోని హీరోల పాత్రలు బాగా నచ్చుతాయి. ఇక రైటర్ గా అంటే .. నేను రాసింది తక్కువేనని చెప్పాలి. వాటిలో 'బృందావనం' సినిమా నాకు బాగా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు. దిల్ రాజుతో నేను మూడు సినిమాలు చేశాను .. త్వరలో మా నుంచి మరో సినిమాను ఆశించవచ్చు" అని అన్నారు.    
koratala
tnr

More Telugu News